స్టీల్ ప్లాంట్ పై వారంలో స్పందించాలి !
1 min read
పల్లెవెలుగు వెబ్: విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై వైసీపీ ప్రభుత్వం వారంలోగా స్పందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ విధించిన. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలంటే అఖిలపక్షం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. చట్టసభల్లో మాట్లాడాల్సిన నేతలు మౌనంగా ఉంటే ఏం లాభమని అన్నారు. వైసీపీ మాటలకు అర్థాలు వేరు అని… చెప్పిన మాటకు తూట్లు పొడవటమే వైసీపీ అధినేత సంకల్పం అని ఎద్దేవా చేశారు. వైసీపీ మాటలన్నీ ఆచరణలోకి రాని మాటలన్నారు. జై తెలంగాణ అంటే తెలంగాణ వచ్చింది. ఆంధ్రా వాళ్లకి ఏది మనది అనిపించదా? అంటూ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించాలి అని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు.