PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘స్పందన’ అర్జీలు… రీ ఓపెన్​ కాకూడదు..: కలెక్టర్ కోటేశ్వరరావు

1 min read
  • పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: స్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రతి అర్జీ, ఫిర్యాదును కాలపరిమితిలోగా పరిష్కరించాలి….ఎట్టి పరిస్థితుల్లోనూ రీఓపెన్‌ కాకూడదని అధికారులను జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి,డిఆర్ ఓ  నాగేశ్వరరావు, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య డిఆర్డిఎ పిడి వెంకటేశులు,  సిపిఓ. అప్పలకొండ తదితరులు నటించిన ప్రజల నుండి వచ్చిన అర్జీలు స్వీకరించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలిగేలా  ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. స్పందన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.  ఆయా శాఖల్లో తమ కింది స్థాయి అధికారుల వద్ద పెండింగ్ లో ఉన్న అర్జీలను పరిశీలించి బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎలోకి ఏ ఒక్క అర్జీ వెళ్లకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు..గడువు దాటి ఒక్క సమస్య కూడా ఉండకూడదన్నారు ..రీ ఓపెన్‌ అయినా, బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎలోకి వెళ్లినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. . పరిష్కారం గురించి అర్జీదారులకు అర్థమయ్యే విధంగా పూర్తి వివరాలతో ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. శాఖల వారీగా పెండింగ్ ఉన్న అర్జీలపై కలెక్టర్ సమీక్షించారు.

పెండింగ్​ కేసులపై… ప్రత్యేక దృష్టి

 జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి హైకోర్టులో  పెండింగ్ లో ఉన్న కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన ముగించేలా  చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  కంటెంప్ట్ రాక ముందే పూర్తి వివరాలతో అప్పీల్ కు వెళ్లాలన్నారు.. ఎంపీడీఓలు గ్రామాలలో త్రాగు నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు త్రాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జగనన్న గోరుముద్ద పథకం ప్రభుత్వ పాఠశాలలో అమలు విషయంపై జిల్లా అధికారులు ఎవరెవరు విజిట్ చేశారో రిపోర్ట్ తెప్పించుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

 జిల్లాల విభజన సందర్భంగా నంద్యాల  జిల్లాకు  సంబంధించిన ఫైల్స్ ను ఆ జిల్లా అధికారులకు పంపాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.. హౌసింగ్ పర్యవేక్షణ కు జిల్లా అధికారులకు మండలాలను కేటాయించాల్సిందిగా కలెక్టర్ హౌసింగ్ పిడి ని ఆదేశించారు.

జీజీహెచ్​లో.. రోగుల అవస్థలు..

ఆస్పత్రుల్లో విద్యుత్ సరఫరా లోపం వల్ల రోగులకు ఇబ్బంది కలగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ ఈ శివప్రసాద్ రెడ్డి, డిఎంహెచ్వో రామ గిడ్డ య్య ను కలెక్టర్ అదేశించారు.. ఈ అంశంలో ఈ రెండు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.. వ్యవసాయానికి సంబంధించి, పంట నష్ట పోయే పరిస్థితి ఉన్న చోట విద్యుత్ సరఫరా అవకాశాన్ని పరిశీలించి రైతులను ఆదుకోవాలని కలెక్టర్ ఎస్ ఈ ని ఆదేశించారు. ఈ అంశంపై  వ్యవసాయ శాఖ అధికారులతో  మాట్లాడాలని సూచించారు ..

స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు :-

  • కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామనివాసి ఈరపోగుల. దానమ్మ. ప్యాలకుర్తి గ్రామ పొలిమేర లో1984 వ సంవత్సరం లో సర్వే నంబర్ 434/4 నందు తన  ఎకరా 12 సెంట్లు భూమిని  స్థానికులు ఆక్రమించుకున్నారని, తనకు   న్యాయం చేయాలని కోరారు.
  • కృష్ణగిరి మండలం ఎస్ హెచ్ ఎర్రగుడి గ్రామ నివాసి E రమణారెడ్డి. తన గ్రామం పొలిమేరలో ని సర్వే నంబర్ 2/1లో  రెండు ఎకరాల 16 సెంట్ల భూమిని    ఆక్రమించుకున్నారని న్యాయం చేయాలని కోరారు…
  • ఆస్పరి మండలం జోహారాపురం గ్రామ నివాసి కే లక్ష్మీదేవి  వారి పూర్వీకుల ఆస్తి సర్వే నంబర్714లో  మూడు ఎకరాల భూమిని తాను  సాగు  చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, ఈ భూమిని ఆన్లైన్లో నమోదు చేయించాలని కోరారు
  • దేవనకొండ మండలం కే వెంకటాపురం గ్రామ నివాసి బి సాయి కుమార్. బి శ్రీనివాసులు. బి శంకరయ్య. మాకు కే వెంకటాపురం గ్రామ పొలిమేరలో సర్వే నంబర్ 826/2A  నందు నాలుగు ఎకరాల 97 సెంట్లు భూమి ఉందని,ఈ భూమిని చుక్కల భూమి నుండి తొలగించాల్సిందిగా వినతి పత్రం సమర్పించారు

About Author