స్పందన సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించాలి..
1 min read– నంద్యాల జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని సమున్..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల కేంద్రమైన గడివేములలో బుధవారం నాడు నంద్యాల జిల్లా కలెక్టర్ మంజిర్ జిలాని సమున్ తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మండల స్థాయిఅధికారులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందన సమస్యలను పెండింగ్ ఉండకుండా త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మండల జరుగుతున్న నాడు నేడు పనులను పాఠశాల ప్రారంభమయ్యే సమయం లోపు నాడు నేడు పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం గడివేముల ఎస్సీ కాలనీలోస్పెషల్ స్కూల్ నందు జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు. ఎస్సీ కాలనీలో స్పెషల్ స్కూల్ కు వెళ్లడానికి రస్తా సమస్యను త్వరగా పరిష్కరించాలని మండల స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం నందు ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో 11 చోట్ల ఇండ్ల స్థలాలను ఇళ్ల నిర్మాణం కొరకు పంపిణీ చేశారు. కానీ ఒకచోట కూడా ఇళ్ళ నిర్మాణం చేపట్టలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని గతంలో కొంతమంది రైతులు నకిలీ పత్తి విత్తనాలతో పంట వేసి నష్టపోయారని ఈ సంవత్సరం నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా జాగ్రత్త ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండలంలోని జరుగుతున్న సచివాలయ. రైతు భరోసా. వైఎస్ఆర్ వైద్య భవన నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలని మండల పంచాయతీరాజ్ శాఖ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సచివాలయం ఉద్యోగులు సచివాలయలలో గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. రైతు భరోసా. ప్రధానమంత్రికిసాన్ పై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు. ఎంపీడీవో శివ మల్లేశ్వరప్ప. వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి. ప్రభుత్వ వైద్యాధి అధికారి జబీన్. ఏపిఎం ఉస్మాన్. అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.