‘స్పందన’ సమస్యలు..ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
1 min readఅధికారులను ఆదేశించిన కలెక్టర్ జి. సృజన
పల్లెవెలుగు: జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు మరియు మండలాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ లను నాణ్యతగా పరిష్కరించడం అత్యంత కీలకమన్నారు. గ్రీవెన్స్ పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సకాలంలో పరిష్కరించడం ముఖ్యమన్నారు. ప్రత్యేక దృష్టి సారించి గ్రీవెన్స్ ను పెండింగ్ ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యతగా గ్రీవెన్స్ కు పరిష్కారం చూపించి రీఓపెన్ రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు గ్రీవెన్స్ పరిష్కారం పై ప్రతిరోజు మానిటర్ చేయాలన్నారు.
జగనన్న సురక్ష… ప్రత్యేక ప్రణాళిక..
జులై 1 నుండి ఆగస్టు 1 వరకు జిల్లా లో నిర్వహించే జగనన్న సురక్ష పథకం లో భాగంగా జూన్ నెల 24 నుండి 30 వరకు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయుట మరియు సచివాలయ పరిధిలో నిర్వహించే క్యాంపు ల ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాలని ఆర్డీఓలు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు,యం.పి డి ఓ ల ను ఆదేశించారు.ఈ నెల 24 నుండి 30 వరకు వార్డు,గ్రామ సచివాలయ పరిధిలోని ప్రతి ఇంటింటికీ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వెళ్లి వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం ఉందో తెలుసుకోవాలని సూచించారు.. కార్యక్రమం విజయవంతం అయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.