మిడుతూరు ఎస్ఐ గా బాధ్యతలు
1 min read– అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు:ఎస్సై
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మిడుతూరు నూతన ఎస్ఐ ఎం.జగన్ మోహన్ యాదవ్ అన్నారు.శనివారం ఉదయం 11 గంటలకు మిడుతూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు.ఎస్సై వచ్చిన వెంటనే పోలీస్ సిబ్బంది ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు.ఈయన 2012 బ్యాచ్ కు చెందిన వారు. మొదటగా పెద్దకడబూరు, నందవరం,గూడూరు,కర్నూలు ఇంటలిజెన్స్,వెలుగోడులో పనిచేస్తూ నంద్యాల విఆర్ కు బదిలీ అయ్యి అక్కడ 50 రోజుల పాటు ఉన్నారు. నంద్యాల విఆర్ నుంచి మిడుతూరుకు బదిలీపై వచ్చినట్లు ఎస్సై పాత్రికేయులతో అన్నారు.గ్రామాల్లో ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే సామ రస్యంగా పరిష్కరించుకోవాలి గాని పంతాలకు పట్టింపులకు పోకుండా అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అంతకాకుండా మండలంలో ఎక్కడైనా సరే నాటు సారా,బెల్టు ఎవరైనా చేస్తూ ఉంటే వాటిని మానుకోవాలని నా దృష్టికి వచ్చినట్లయితే వీటి పట్ల చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.అంతేకాకుండా మండలంలోని స్థితిగతుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ మారుతి శంకర్ జూపాడుబంగ్లాకు బదిలీ అయిన సంగతి పాఠకులకు తెలిసిందే.