PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి గా భాధ్యతలు

1 min read

– జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆషా ను మర్యాదపూర్వకంగ కలిసిన ఏపీఎన్జీవో స్ సంఘ నాయకులు..
అధ్యక్ష , కార్యదర్శులు చోడగిరి శ్రీనివాస్, నెరసురామారావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో నూతనంగా ఏలూరు జిల్లా కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి గా భాధ్యతలు చేపట్టిన శ్రీమతి డి ఆషా ని మర్యాదపూర్వకంగా ఏపీ ఎన్జీవో ఎస్ నాయకులు కల్సి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా నిబద్ధతతో పనిచేసే వారికి అండగా నిలవాలి అన్నారు, వృత్తిపరంగా అధికారులతో తోటి ఉద్యోగస్తులతో మమేకమై పనిచేసి మంచి పేరు తీసుకురావాలన్నారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు.మహిళా విభాగం జిల్లా చైర్ పర్సన్ కె. నాగమణి . కార్య నిర్వాహక కార్యదర్శి దావాల నరేంద్ర బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి దుగ్గిపోగు లీలా రాణి, ఏలూరు తాలూకా సహధ్యక్షుడు జి. రవికుమార్. కార్య నిర్వాహక కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author