స్పందన అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలి
1 min read– రిజెక్షన్, రీ ఓపెన్ ఉండకూడదు
– జిల్లా కలెక్టర్ డా.గుమ్మళ్ళ సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : స్పందన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను నాణ్యత గా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. గుమ్మళ్ల సృజన అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులు పరిష్కరించకుండా తిప్పి పంప కూడదని, తమ పరిధిలో లేని సమస్య అయితే అర్జీదారునికి ఆ కారణం స్పష్టంగా చెప్పాలని కలెక్టర్ సూచించారు. అలాగే రీ ఓపెన్ కాకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. నాణ్యమైన పరిష్కారం వల్ల ఫిర్యాదులు రీ ఓపెన్ అయ్యే అవకాశం ఉండదన్నారు. అర్జీదారుల వినతి పత్రాలను ఆయా శాఖల అధికారులకు పంపుతూ గడువు లోపు ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు.కార్యక్రమంలో డిఆర్వో నాగేశ్వర రావు , జిల్లా అధికారులు పాల్గొన్నారు.