ఆంక్షలు..సబబు కాదు..
1 min read– వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే.. 11వ వేతన సవరణ ఏపీజీబీలోనూ అమలు చేయాలి
– కేంద్ర ప్రభుత్వ వైఖరికి.. నిరసన తెలిపిన ఉద్యోగ సంఘాలు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: జాతీయ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ (NIT) అవార్డ్, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వాణిజ్య బ్యాంకుల్లో అమలు చేసిన 11వ వేతన సవరణను ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల్లోనూ పూర్తిస్థాయిలో అమలు చేయాలని UFRRBU/AIRRBEA ఉద్యోగ సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 11వ వేతన సవరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ…మంగళవారం ఏపీజీబీ ప్రధాన కార్యాలలయం , రీజనల్ కార్యాలయాల వద్ద అధికారులు, ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా నిరసన తెలిపారు. వాణిజ్య బ్యాంకుల్లో అమలు చేసిన 11వ వేతన సవరణ మాదిరిగానే.. గ్రామీణ బ్యాంకుల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం కుటిల బుద్దితో వివిధ రకాల అలవెన్సులు మరియు అర్రియర్స్ విషయంలో ఆంక్షలు విధించడం సబబు కాదన్నారు. “పే రివిషన్ గురించి నాల్గు నెలలు ఆలస్యంగా నిర్ణయం తీసుకొన్న కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ( DFS), అలవెన్సుల గురించి మూడు రకాలుగా విభజించిందని, Part – II అలెవెన్సులు స్పాన్సర్ బ్యాంక్ దాయదక్షిణ్యాలకు వదిలేసి, కొత్తగా వచ్చిన allowances లను గ్రామీణ బ్యాంకుల restructure అయ్యే వరకు నిరవధికంగా వాయిదా వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇక అరియర్స్ గురించి తొమ్మిది నెలల తర్వాత సగం, మరో 6 నెలల తర్వాత మిగతా సగం పూర్తి చేస్తామని వెల్లడించడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో అధికారుల సంఘం డెప్యూటీ సెక్రటరీ R. రాము, రీజనల్ సెక్రెటరీ K. జగదీశ్వర్ రెడ్డి, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు E. హన్మంత్ రెడ్డి, రీజనల్ సెక్రెటరీ G. మధుసూదన్ పాల్గొన్నారు.