క్రిప్టో అడ్వర్టైజింగ్ పై ఆంక్షలు
1 min readపల్లెవెలుగువెబ్ : బిట్‌కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలతోపాటు నాన్ ఫంగిబుల్ టోకెన్స్ పెట్టుబడులను ప్రోత్సహించే ప్రకటనలకు అడ్వర్టైజింగ్ స్టాండర్స్ కౌన్సి ల్ ఆఫ్ ఇండియా కళ్లెం వేసింది. క్రిప్టో కరెన్సీలు అనియంత్రిత , అధిక రిస్క్‌తో కూడిన పెట్టుబడి సాధనాలని ప్రజలకు తెలిపే డిస్‌క్లెయిమర్‌ను ప్రకటనల్లో ప్రముఖంగా ప్రదర్శించాల్సిందేనని మార్గదర్శకాలు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని యాస్కీ స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ డిజిటల్ ఆస్తుల్లో పెట్టుబడులపై నష్టాలకు ఎవరూ బాఽధ్యత వహించరని, ప్రభుత్వ నియంత్రణ మండళ్లను కూడా ఆశ్రయించలేరన్న విషయాన్ని ప్రకటనల్లో ప్రస్తావించాలని ప్రచారకర్తలను నిర్దేశించింది.