గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు.. తొలగించాల్సిందే…
1 min read– వీహెచ్పీ రాష్ట్ర కార్యాధ్యక్షులు నందిరెడ్డి సాయి రెడ్డి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కరోన బూచి చూపి… వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించడం సమంజసం కాదన్నారు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాదక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి. వినాయక ఉత్సవాలపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం నగరంలోని వినాయక ఘాట్ దేవాలయం వద్ద 9 గంటలపాటు ఉపవాస దీక్ష చేశారు. ఈ సందర్భంగా వీహెచ్పీ జిల్లా కార్యాదక్షులు కె. కృష్ణన్న మాట్లాడుతూ గణేశ ఉత్సవాలపై ఆంక్షలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం పండ్లు,అరటి పిలకలు,వినాయక విగ్రహాలు,పూలు,పత్రి, వంటివి అమ్ముకుని జీవించే చిన్న వ్యాపారుల కడుపు కొట్టొద్దని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీక్షా శిబిరం వద్దకు బీజేపీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వచ్చి మద్దతు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ మనోభావాలు కించపరిచేలా… పండగలు దెబ్బతినేలా దాడులు చేస్తున్నారని, దీన్ని ఏమాత్రం ఉపేక్షించేదిలేదన్నారు.
కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహకార్యదర్శి యస్.ప్రాణేష్,రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్, జిల్లా సేవా కన్వీనర్ తుంగా రమేష్,సత్సంఘ కన్వీనర్ మాకం నాగరాజు, ఉత్సవసమితి సాంస్కృతిక కన్వీనర్ నాగరాజు విజయ్,ఆర్.యస్.యస్. నాయకులు కోదండరాం,రామకృష్ణ, కర్నూలు నగర కార్యాధ్యక్షులు గోరంట్లరమణ,కార్యదర్శి మాళిగి భానుప్రకాష్,రాష్ట్ర బజరంగ్దళ్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి,విభాగ్ బజరంగ్దళ్ నీలి నరసింహ,జిల్లా కన్వీనర్ రామకృష్ణ,నగర కన్వీనర్ ప్రసన్నకుమార్ రెడ్డి, సాప్తాహిక్ మిలన్ కన్వీనర్ సాయిరామ్, భగీరథ,భాస్కర్,నరేంద్ర,అశేష హిందూబంధువులు పాల్గొన్నారు. కాగా ఏపీలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు ఏపీ హైకోర్టు బుధవారం సాయంత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వీహెచ్పీ , భజరంగ్ దళ్ కార్యకర్తలు, నాయకులు , ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.