– రెండు రోజుల వర్షం కారణంగా నిలిచి మళ్లీ ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలు .
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పోలీసు నియామక పక్రియలో భాగంగా రాయలసీమ జోన్ కు సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు కర్నూలు APSP 2 వ బెటాలియన్ లో దేహదారుడ్య పరీక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి కే 600 మంది అభ్యర్దులు హాజరయ్యారు.ఈ దేహాదారుడ్య సామర్థ్య పరీక్షలను కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ , జిల్లా ఎస్పీ శ్రీ జి . కృష్ణ కాంత్ ఐపియస్ గారు, సెబ్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐపియస్ పర్యవేక్షిస్తున్నారు.