ప్రతీకార ప్రజా వ్యతిరేక విధానాలను.. మతపరమైన సమస్యలను సృష్టిస్తున్నారు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : శనివారం SDPI పార్టీ ఆలూరు నియోజకవర్గంమైన హోలగుంద లో పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఎస్డిబీ tvఐ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎస్డిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు . సభను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ ఎన్నికల్లో వేళల్లో చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోగా ప్రతీకార ప్రజా వ్యతిరేక విధానాలను మరియు మతపరమైన సమస్యలను సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అర్థరహిత విధానాలను అవలంబిస్తూ ప్రజలపై పెనుబారం మోపుతున్నారు. ముడిచమురు ధరలు తగ్గిన అధిక పన్నులు విధిస్తూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచుతూ పోతున్నారు.జీఎస్టీ విధానంలో సామాన్యులకు భారం మోపుతూ కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ప్రకటిస్తూ రైట్ ఆఫ్ పేరుతో వారి అప్పులను మాఫీ చేయడం జరుగుతూ ఉంది. ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేయకపోగా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి దేశ భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలను అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలను చైతన్యపరిచి వీరి పాలనను అంతమందించాలని పిలుపునిచ్చారు.ఇందులో భాగంగాఆంధ్రప్రదేశ్ ఎస్డిబీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూరాబోయే ఎన్నికలకు సర్వసన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారురాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తమ తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రం మొత్తం ఆదాయాన్ని వెచ్చించిన నవరత్నాలు పేరుతో ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేక పోతున్నారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధిపై ఎటువంటి చర్యలు తీసుకుపోగా ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారు. చెత్త పై పన్ను విద్యుత్ చార్జీలు పెంచడం జరుగుతూ ఉంది.రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించే రహదారుల వ్యవస్థ చెప్పుకో నవసరం లేదు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా కేవలం హామీలకే పరిమితమవుతున్నారే కానీ ఎటువంటి వారిలో మార్పు రావటం లేదని వాపోయారుఈ కార్యక్రమంలోఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు m.సైఫుల్లప్రధాన కార్యదర్శిT. రహిమాన్కమిటీ సభ్యులుM. హారుణ్Smd.షపి K. భాష పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.