PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యకు పేదరికం అడ్డుకాకూడదు ..రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్

1 min read

ఉర్దూ విద్యాభివృద్ధి కోసం రూ 12 లక్షల సహాయం.

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  వెలుగోడు  పేద విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డుకాకూడదన  ఫౌండేషన్ చైర్మన్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీత ముల్లా అబ్దుల్ కరీం అన్నారు. శనివారం నాడు వెలుగోడు పట్టణ జూనియర్ కళాశాల ఉర్దూ మీడియం విద్యార్థుల స్కాలర్షిప్లు ఉపాధ్యాయులకు గౌరవ వేతనం కళాశాలకు ఆర్థిక సహాయం కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ రత్న స్వామి మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా కరీం ఫౌండేషన్ ద్వారా ఆత్మకూరు మరియు వెలుగోడు ఉర్దూ జూనియర్ కళాశాలలో విద్య అభ్యసించు విద్యార్థిని విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం సుమారు ప్రతి సంవత్సరం 15 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించడం హర్షించదగ్గ విషయం అన్నారు. అదే విధంగా వరదల సమయంలో వరద బాధితులకు వంట సామాగ్రి దుస్తులు పంపిణీ చేసి తన అవుతాడు అని చాటుకున్నారన్నారు వెలుగోడు పట్టణ వాసి , చీఫ్ ఇంజనీర్ గా జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల మౌలిక వసతుల కోసం ప్రభుత్వంతో నిధులు మంజూరు చేయించారన్నారు. అదేవిధంగా కోట్ల రూపాయలు విలువలు చేసే అనేక సీసీ రోడ్లు  బి టి రోడ్లు వేయించారన్నారు మహిళలకు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుచేసి శిక్షణ ఇస్తున్నారు అన్నారు. వెలుగోడు జిల్లా పరిషత్ పాఠశాలలో భారీ ఎత్తుగా మెడికల్ క్యాంపులో ఏర్పాటు చేసి అన్ని విధాల వైద్య పరీక్షలతో పాటు మందులను ఉచితంగా పంపిణీ చేశారన్నారు. అటువంటిక వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ప్రయాణం చేయడం హర్షనీయమన్నారు. ఫౌజియా కరీం ఫౌండేషన్ చైర్మన్ కరీం మాట్లాడుతూ  విద్యార్థులు కూడా ఉన్నత ఆశయాలతో విద్యను అభ్యసించి తాము భవిష్యత్తులో స్థిరపడుటయే కాక వారి కుటుంబానికి ఆసరాగా  ఉండాలన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పుట్టిన గ్రామాన్ని, చదువుకున్న కళాశాలలో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఎప్పటికీ మరువరాదు అన్నారు. అనంతరం విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉపాధ్యాయులు గౌరవ వేతనం ,కళాశాల అభివృద్ధికి నిధులు అందించారు. ఈ కార్యక్రమంలో ఫోజియా కరీం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి అలీమ్, మాజీ సర్పంచ్ సయ్యద్ సులేమాన్ ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author