పదవి విరమణ పొందిన కర్నూలు ట్రాఫిక్ ఎస్సై…సన్మానించిన ఎస్పీ
1 min readటి. ఎస్. ఎస్ ప్రసాద్ కుమార్ ని సన్మానించిన ….. కర్నూలు జిల్లా ఎస్పీ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పదవి విరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ అన్నారు.ఈ సంధర్బంగా సోమవారం పదవి వీరమణ పొందిన కర్నూలు ట్రాఫిక్ ఎస్సై టి. ఎస్. ఎస్ ప్రసాద్ కుమార్ ని కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శాలువ, పూలమాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడారు.పోలీసుశాఖకు వారు అందించిన సేవలను జిల్లా ఎస్పీ కొనియాడారు.కుటుంబాలతో సంతోషంగా గడపాలన్నారు.పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీ ని సంప్రదించవచ్చన్నారు. ఈయన స్వస్ధలం కర్నూలు. 1980 లో పోలీసు శాఖలో చేరారు. 2020 లో ఎస్సై గా పదోన్నతి పొందారు. రైల్వే, డిటిసి, ట్రాఫిక్ పిఎస్ లలో పని చేశారు. పోలీసుశాఖలో 44 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు , ఎస్సై కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం – కర్నూలు.