జీజీహెచ్లో జి.మనోరాజ్ జూనియర్ అసిస్టెంట్ పదవీ విరమణ
1 min readఅడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరీ హాల్ లో నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ. జి.మనోరాజ్ జూనియర్ అసిస్టెంట్ పదవి విరమణ చేస్తున్నట్లు తెలియజేశారు.ఆసుపత్రిలో ఏమైనా పనులకు మినిస్ట్రీయల్ స్టాఫ్ సిబ్బంది చాలా కీలకమని తెలిపారు.అనంతరం శ్రీ. జి.మనోరాజ్ జూనియర్ అసిస్టెంట్ పదవి విరమణ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ధన్వంతరీ హాల్ లో నిర్వహించిన సన్మాన సభ కార్యక్రమానికి శ్రీ. జి.మనోరాజ్ జూనియర్ అసిస్టెంట్ దంపతులకు పూలమాల మరియు శాలువాతో సత్కరించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి CSRMO ,డా. వెంకటేశ్వరరావు, డిప్యూటీ CSRMO, డా.హేమనళిని, అకౌంటెంట్స్, శ్రీ కుమారస్వామి శ్రీ.లతిఫ్ బేక్, మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు తెలిపారు.