పదవి విరమణ వీడ్కోలు సభ…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఏపీ.జి.డి.ఎ ఆధ్వర్యంలో డాక్టర్ గోపిరెడ్డి కొండారెడ్డి కి పదవి విరమణ వీడ్కోలు సభ….. డా. గోపిరెడ్డి కొండారెడ్డి సర్జరీ సేవలు ప్రశంశనీయం అని ఏపీ. జి.డి.ఎ అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్ అన్నారు. శనివారం నాడు ఈ నెలలో పదవీ విరమణ చేయబోతున్న సర్జరీ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ గోపిరెడ్డి కొండారెడ్డి కి ఏపీ జి డి ఏ ఆధ్వర్యంలో ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీ యందు పదవీ విరమణ వీడ్కోలు సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోపిరెడ్డి కొండారెడ్డి విద్యార్థులకు సర్జరీ మెలకువలు బాగా నేర్పించే వారిని వైద్య విద్యార్థులు వీరి సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని కొనియాడారు. గోపి రెడ్డి ఇదే కాలేజీ విద్యార్థి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి డాక్టర్ శ్రీనివాస్ సభ్యులు డాక్టర్ మాధవి శ్యామల, డాక్టర్ జయరాం, డాక్టర్ బాల సారయ్య, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ సోమప్ప డాక్టర్ హేమనలిని తదితరులు డా గోపిరెడ్డి కొండారెడ్డి, సతీమణి శ్రీమతి బ్రమ దంపతులను ఘనంగా సన్మానించడం జరిగింది.