NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి సర్వసాధారణం:ఎంపీ

1 min read

ఎంపీ  వ్యక్తిగత కార్యదర్శి ప్యాపిలి చంద్రశేఖర్ పదవీ విరమణ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఎంపీ కార్యాలయంలో ఎంపీ  వ్యక్తిగత కార్యదర్శి ప్యాపిలి చంద్రశేఖర్ పదవీ విరమణ సందర్భంగా  కర్నూలు పద్మశాలి అఫిషియల్స్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ POPA ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ  మాట్లాడుతూ  పదవీ విరమణ ప్రతి ఒక్క ఉద్యోగికి సర్వసాధారణమని ఉద్యోగంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి ప్యాపిలి చంద్రశేఖర్  అని అదేవిధంగా  మజి రాష్ట్ర మంత్రులు మరియు నా దెగ్గర తనదైన శైలిలో జిల్లా అభివృద్ధి కోసం తన సలహాలు సూచనలు ఉపయోగపడ్డాయని ఎంపీ   కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి అఫిషియల్స్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ పద్మశాలి స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ పాలకుర్తి రమేష్, వేమయ్య,మేడం సుంకన్న, కస్తూరి, జెరుబండి హరి ప్రసాద్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

About Author