ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరి
1 min read
పల్లెవెలుగు, వెబ్ చాగలమర్రి : ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరని చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచి పోతాయని సిడిపిఓ తేజేశ్వరి బుధవారం తెలిపారు. స్థానిక చాగలమ్మ ఆలయ ప్రాంగణంలో చాగలమర్రి పట్టణం లోని ఒకటవ అంగన్‌వాడి కేంద్ర కార్యకర్త సుగుణ పదవి విరమణ సభ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా అంగన్ వాడి కార్యకర్తల ఆద్వర్యంలో సుగుణమ్మను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె 32 ఏళ్ల పాటు అంకిత భావంతో చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్ సుశీల,అంగన్‌వాడి కార్యకర్తలు, చంద్రకళ, హసీనా, వహీదా, నాగమణి, పద్మ, మైమున్, మహబుచన్ ,ఇందుమతి, రజని, ఆసానమ్మ, శారద, అనురాధ, రెహెనా, రామసుబ్బమ్మ, సుజాత, రహమత్, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.