మాస్క్డ్ ఆధార్ పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
1 min readపల్లెవెలుగువెబ్ : అధికారిక అనుమతి లేని ప్రైవేటు సంస్థకు వ్యక్తులు తమ ఆధార్ కార్డు జెరాక్స్ కాపీని ఇచ్చేటపుడు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌డ్ ఆధార్ కార్డును వినియోగించాలని సలహా ఇచ్చిన కాసేపటికే ఈ సలహాను ప్రభుత్వం ఉపసంహరించింది. ఈ సలహాను యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయం అధికారి జారీ చేశారని, దీనిని ఉపసంహరిస్తున్నామని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. యూఐడీఏఐ పత్రికా ప్రకటనను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందువల్ల దానిని ఉపసంహరిస్తున్నట్లు ఈ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను ఆదివారం విడుదల చేసింది. ఆధార్ కార్డు హోల్డర్లు తమ ఆధార్ సంఖ్యలను ఉపయోగించేటపుడు, ఇతరులతో పంచుకునేటపుడు సాధారణ వివేకాన్ని వినియోగించాలని మాత్రమే యూఐడీఏఐ తెలిపిందని వివరించింది.