NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా కలెక్టర్, రెవిన్యూ సిబ్బందిని అభినందించిన రెవిన్యూ శాఖా మంత్రి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :   జంగారెడ్డిగూడెం,ఏలూరు జిల్లాలో రెవిన్యూ యంత్రా0గం రాష్ట్ర రెవిన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు అభినందించారు.  జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ప్రారంభించేందుకు శనివారం జిల్లాకు విచ్చేసిన మంత్రికి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి మంత్రికి  పూలమొక్కను అందించి స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా జిల్లాలో జగనన్న ఇళ్లకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, శాశ్వత భూహక్కు, భూసర్వే, అసైన్మెంట్ భూములపై నిరుపేదలకు శాశ్వత హక్కులు కల్పన, తదితర అంశాలపై వివరాలను జిల్లా కలెక్టర్, జేసీ లను మంత్రి అడిగి తెలుసుకున్నారు.  అసైన్మెంట్ భూములపై నిరుపేదలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఇటీవల ఏలూరు జిల్లా నూజివీడులో పేదలకు పట్టాలు అందించారని, పేదల భూములకు పట్టాల పంపిణీలో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.  జగనన్న ఇళ్ల పధకంలో ఇళ్ల స్థలాల పంపిణీలో భూమి సేకరణ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన జగనన్న శాశ్వత  భూహక్కు, భూ సర్వే కార్యక్రమం కూడా జిల్లాలో వేగవంతంగా అమలు కావడంపై  రెవిన్యూ అధికారులను మంత్రి అభినందించారు.  ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేలా సిబ్బంది పనిచేయాలన్నారు. సమాచార సాంకేతిక వ్యవస్థలో  మారుతున్న కాలానికి అనుగుణంగా రెవిన్యూ సిబ్బంది తమను తాము అప్డేట్ చేసుకుని ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సిబ్బంది పనిచేయాలన్నారు.  జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం పరిపాలనా భవనంను మంచి ఆహ్లాదకరమైన రీతిలో తీర్చిదిద్ది  తక్కువ సమయంలో నిర్మించారని, అదే రీతిలో కార్యాలయంనకు వచ్చే ప్రజలకు కూడా మంచి సేవలందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.  ఆర్డీఓ కార్యాలయం భవనంను అతితక్కువ సమయంలోనే ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చేందుకు కృషిచేసిన శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ను మంత్రి ధర్మాన ప్రసాదరావు అభినందించారు.

About Author