సీఎం,మంత్రికి రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం కృతజ్ఞతలు
1 min read– పలు అంశాలపై వినతి, సానుకూలంగా స్పందించిన మంత్రి ధర్మన
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రాష్ట్ర సచివాలయంలో రెవిన్యూ మంత్రి గారిఛాంబర్లో రెవెన్యూ మంత్రి చేతుల మీదుగా గ్రేడ్ 2 నుండిగ్రేడ్1 గా ప్రమోషన్ ఛానల్ కల్పిస్తూ ప్రభుత్వం జీ ఓ నెంబర్166 ను రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర అధ్యక్షులు. భూపతి రవీంద్ర రాజు గురువారం మంత్రి ధర్మాన ప్రసాద రావుని కలిసి హర్షం వ్యక్తం చేస్తూ , పలు అంశాలపై వినతి పత్రాన్ని అందజేయడం అందజేయడం జరిగింది. అలాగే గ్రేడ్2 విఆర్ఓ ల సమస్యలపై ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే వీఆర్ఏలు సమస్యలపై కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని. మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగిందన్నరు. అలాగే ఈరోజుగ్రేడ్2 విఆర్వోలకు ప్రమోషన్ ఛానల్ కల్పిస్తూ జీవో నెంబర్ 166 ఇవ్వడం పట్ల రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. జి సాయి ప్రసాద్ కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందన్నరు. తదుపరి సీసీఎల్ఏ అడిషనల్ జాయింట్ సెక్రెటరీ, ఇంతియాజ్ ని కలిసి వీఆర్వోల సమస్యలపై వినతి పత్రం పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దేవరాజు, గోపాలకృష్ణ , పల్నాడు జిల్లా అధ్యక్షులు. ఆరుమళ్ళ నాగేశ్వరరావు పాల్గొనడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు.