రోడ్డు పనులను ఆపిన రెవెన్యూ సిబ్బంది..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు గ్రామం దగ్గర జరుగుతున్న రోడ్డు పనులను రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్లి పనులను అక్కడికి వెళ్లి చేశారు.స్కై ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రాజెక్టు కొరకు జలకనూరు గ్రామానికి చెందిన పట్టా భూమిని 50 ఎకరాల పొలాన్ని ప్రాజెక్టు వారు కొన్నారు. తర్వాత వీటిలో డి పట్టా (ప్రభుత్వ) భూమిని కూడా రస్తా కొరకు భూమిని కొన్నారు. కొందరు గ్రామ రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ బాష, జలకనూరు వీఆర్వో రమణారెడ్డి,తలముడిపి వీఆర్వో సంజీవరాజు,గ్రామ సర్వేయర్ సత్యనారాయణ పనులు జరిగే ప్రదేశానికి వెళ్లి వెంచర్లో రోలర్ తో రోడ్లు రోడ్లు వేయిస్తూ ఉండగా మీరు వెంచర్లు వేస్తున్నారు దీనికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా అని సిబ్బంది వారిని అడిగారు.ఆధారాలు చెప్పేవరకు మీరు పనులు చేయకూడదని పనులు నిలిపివేశారు.ఒకవేళ మీరు పనులు చేసినట్లయితే చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వారిని హెచ్చరించారు.