NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కనపర్తి లే అవుట్ పై సమీక్ష సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని కనపర్తి లేఅవుట్లో జగనన్న కాలనీకి సంబంధించి గృహ నిర్మాణాలపై మంగళవారం సాయంత్రం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ మాట్లాడుతూ, కనపర్తి లేఅవుట్లలో నిర్మించే జగనన్న గృహ నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు వేగవంతం చేయాలని తెలిపారు, దీనికి సంబంధించిన హౌసింగ్ అధికారులు ఎప్పటికీ కప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టు తెప్పించుకొని పనులను వేగవంతం చేసే దిశగా చూడాలని తెలిపారు, ఇప్పటికే ఆలస్యం అయిందని ఇకమీదట అలాంటి అలసత్వం లేకుండా చూడాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు, హౌసింగ్ డి ఈ మాట్లాడుతూ, కనపర్తి జగనన్న లేఔట్లలో ఇప్పటికీ 670 పక్కా గృహాలలో 93 గృహాలకు స్లాపులు వేయడం జరిగిందన్నారు, అలాగే 352 గృహ నిర్మాణాలకు సంబంధించి స్లాబ్ లెవల్ కు గోడలు వచ్చాయని తెలిపారు, అదేవిధంగా 218 ఇండ్లకు సంబంధించి బేస్ మట్టాలు పూర్తయ్యాయని ఇవన్నీ కూడా జనవరి ఫిబ్రవరి కల్లా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు, ఇందుకు కాంట్రాక్టర్ కూడా పనులు వేగవంతం చేయడం జరుగుతుందని చెప్పడం జరిగిందని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, హౌసింగ్ ఏఈ మేనిల్ తదితరులు పాల్గొన్నారు.

About Author