మరణాల తగ్గింపు పై సమీక్ష సమావేశం…
1 min read– ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకట రంగా రెడ్డి, మాట్లాడుతూ:
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హల్ నందు పలు విభాగాల వైద్యులతో మరణాల తగ్గింపుపై వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని ధన్వంతరి హాల్లోని రెండు (నెఫ్రాలజీ మరియు గైనిక్) విభాగాలలో డెత్ కేసుల గురించి పవర్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించినట్లు తెలిపారు.ఆస్పత్రిలోని జరిగిన మరణాల రివ్యూ చేసి వాటిని ఎలా తగ్గించాలి తగ్గించడానికి కావలసిన మౌలిక సదుపాయాలు మరియు చికిత్స లోటుపాట్లను తీసుకోవాల్సిన తగు చర్యల గురించి ఈరోజు వైద్య సిబ్బందితో చర్చించినట్లు తెలిపారు.ఆసుపత్రిలో ప్రతినెల రెండవ వారంలో మరణాలపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. పేషంట్ కు సంబంధించిన ప్రతి ఇన్వెస్టిగేషన్స్ మరియు ట్రీట్మెంట్ కేసీట్లో పొందుపరిచాలని వైద్యులకు మరియు నర్సింగ్ సిబ్బందికి ఆదేశించారు.ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డా.సుధాకర్, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర్ రెడ్డి, CSRMO, డా.వెంకటేశ్వరరావు, అన్ని విభాగాల హెచ్వైడీస్ డా.హరి చరణ్, డా.శ్రీనివాసులు, డా.కొండారెడ్డి, డా.ఇక్బాల్ హుస్సేన్, డా. డా.విజయ ఆనందబాబు, డా.మాణిక్యరావు, RMO డా.వెంకటరమణ, మరియు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, డా.శివబాల నగంజన్, డా.కిరణ్ కుమార్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకట రంగా రెడ్డి, తెలిపారు.