మాధ్యమిక విద్యపై సమీక్ష సమావేశం
1 min read
ఉత్తమ ఫలితాల దిశగా సమిష్టి కృషి అవసరం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ
పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి,ఉప విద్యాశాఖ అధికారులు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : మాధ్యమిక విద్యపై సమీక్ష ఉత్తమ ఫలితాల దిశగా సమిష్టి కృషి అవసరంఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన మాధ్యమిక విద్య (సెకెండరి ఎడ్యూకేషన్) పై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉప విద్యా శాఖాదికారులు పాల్గొన్నారు.సమీక్షలో ప్రధానంగా స్కూల్ రీఓపెనింగ్, విద్యార్థులకు అవసరమైన సరఫరాలు, నాణ్యమైన మధ్యాహ్న భోజన నిర్వహణ, ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల మెరుగుదల, అలాగే జిల్లా పరిషత్ నిధులతో రూపొందించిన విజయకేతనం పుస్తకాల ప్రాముఖ్యత వంటి అంశాలపై చర్చించారు . ఈ విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీ నుండి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రారంభానికి ముందు “బడి బాట” కార్యక్రమం ద్వారా విద్యార్థుల హాజరును పెంచే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్. ప్రారంభ వారంలో హాజరు పరిస్థితిపై చర్చించారు .విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, షూలు, బ్యాగులు, స్టేషనరీల వంటి విద్యా కిట్స్ పంపిణీ ప్రగతిపై సమీక్షచేసారు . కొన్ని మండలాల్లో సరఫరాలో ఆలస్యం ఉన్నట్టు గుర్తించి, వాటిని వెంటనే పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వేడి, నాణ్యమైన, పరిశుభ్రమైన విధంగా అందించాలనే దృష్టితో చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకించి రూరల్ ప్రాంతాల్లో మెను పాటింపు, శుభ్రత, తాగునీరు, వంటగదుల పరిస్థితులపై పర్యవేక్షణ పెంచాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కొరత పై పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల వివరాలను సమీక్షించి, తాత్కాలిక భర్తీకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సైన్స్, మ్యాథ్స్ వంటి కీలక సబ్జెక్టుల కోసం ఉపాధ్యాయుల భర్తీ అత్యవసరమని పేర్కొన్నారు.పాఠశాలల్లో విద్యుత్, తాగునీరు, , క్రీడా సామగ్రి వంటి మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విజయకేతనం పుస్తకాల ప్రభావం జిల్లా పరిషత్ నిధులతో ఉమ్మడి విద్యాశాఖ రూపొందించిన “విజయకేతనం” పుస్తకం గత విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచినది. ఈ పుస్తకాన్ని ముందుగా విద్యార్థులకు అందించగలిగితే, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెరుగైన ఫలితాల సాధనకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకోసం అవసరమైన నిధుల మంజూరు కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. “ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య, సరైన వసతులు, సరైన ఆహారం మరియు అవసరమైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జిల్లా పరిషత్ నిరంతరం కృషి చేస్తోంది. ఉత్తమ ఫలితాల సాధనకు ప్రతి ఉపాధ్యాయుడు, విద్యా అధికారుల పాత్ర ఎంతో కీలకం” అని శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ గారు అన్నారు.ఈ కార్యక్రమం లో జడ్పీ సీఈఓ యం శ్రీహరి, జడ్పీ డిప్యూటీ సీఈవో కె భీమేశ్వర్, డిఇఓ వెంకటలక్ష్మమ్మ ,నారాయణ ,ఉపవిద్యాశఖాదికారులు, సి ఈ బోర్డ్ కార్యదర్శి ఎ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
