లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులు పై రివ్యూ మీటింగ్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జి.కబర్థి, చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కర్నూలు వారి సూచనల మేరకు శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి, సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు వారు కర్నూలు కోర్టు కాంపౌండ్ లో గల న్యాయ సేవా సదన్ నందు “లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులు పై రివ్యూ మీటింగ్” నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ “లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులు, చట్టపరమైన సలహాలు, జైలు విజిట్లు, కేసుల వివరాలు మరియు పరిష్కారము మొదలగు అంశాలను వివరించారు.అలాగే ఎన్ని కేసెస్ లలో బెల్స్ మంజూరు చేశారో కేసుల యొక్క స్థితిగతులను తెలుసుకొని వాటిని ఏ విధంగా త్యరిత గతిన పరిష్కరించాలో అనే దానిపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శివరాం, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, శ్రీమతి ఏ. సులోచన , అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పాల్గొన్నారు.