PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జీజీహెచ్​లో  హెచ్వోడీ లతో సమీక్ష సమావేశం

1 min read

– అడిషనల్ DME & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి,  మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  పలు  విభాగాలలో మరింతగా ఇంప్లిమెంటేషన్ చేయాలని సంబంధిత హెచ్చోడిలకు సూచించారు.ఆసుపత్రి లోని పలు విభాగాలలో ఆరోగ్యశ్రీ  ప్రీ ఆథరేషన్ రిజిస్ట్రేషన్ మరియు క్లైమ్ పైడ్ కేసెస్ రిజెక్ట్ కాకుండా చూసుకోవాలని మరియు ప్రతి ఒక్క కేసు మోనిటరింగ్ చేయాలని సంబంధించిన హెచ్చోడిలకు తెలియజేశారు.ఆసుపత్రిలోని జరగబోయే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు వైద్యులు మరియు వైద్య సిబ్బంది అందరూ తప్పకుండా హాజరు కావాలని వారి ఆదేశించారు. ఆసుపత్రిలో అత్యవసర పరికరాలు  కొనేందుకు పర్చేస్ కమిటీని నియమించినట్లు తెలిపారు.ఆసుపత్రిలో ఈనెల 28వ తేదీన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, బన్స్ వర్డ్ మరియు  కేఎంసిలోని ఎగ్జామ్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో అందరూ  వైద్యులు మరియు  వైద్య సిబ్బంది పాల్గొనాలని మరియు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు.ఆసుపత్రిలోని అన్ని విభాగాలలో అటెండెన్స్ రిజిస్టర్ మరియు సెలవులకు సంబంధించిన అటెండెన్స్ రిజిస్టర్ లీవ్ అడ్రస్ ప్రాపర్లి మైంటైన్ చేయాలనిహెచ్చోడిలకు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి  కర్నూలు  వైద్య కళాశాల అడిషనల్ DME & ప్రిన్సిపాల్,  డా.సుధాకర్,  ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర్ రెడ్డి, ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, డిప్యూటీ CSRMO డా.హేమనలిని, హెచ్వోడీస్, డా.రామకృష్ణ నాయక్, డా.రాధరాణి, డా.శ్రీనివాసులు, RMO డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా. కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ DME & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, తెలిపారు.

About Author