4 జిల్లాల ఎస్పీ లతో సమీక్షా సమావేశం.. కర్నూలు రేంజ్ డిఐజి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: 4 జిల్లాల ఎస్పీ లతో సమీక్షా సమావేశం నిర్వహించిన… కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ యస్. సెంథిల్ కుమార్ ఐపియస్ . కర్నూలు రేంజ్ డిఐజి గ కార్యాలయం లో కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల ఎస్పీలతో కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ యస్. సెంథిల్ కుమార్ ఐపియస్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ యస్. సెంథిల్ కుమార్ ఐపియస్ మాట్లాడుతూ .2024 లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉద్యోగుల బదిలీల పై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ సెంథిల్ కుమార్ ఐపియస్ తెలిపారు. ఈ మేరకు పోలీసు అధికారుల బదిలీలు, ఎన్నికలతో సంబంధం ఉన్నవారు, దీర్ఘకాలంగా ఒకే చోట ఉన్నవారిని ఎన్నికల విధులలో ఉండకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. 3 ఏళ్ళుగా ఒకే జిల్లాలో ఉన్నవారిని కొనసాగించకూడదని సూచించిందన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసుశాఖలోని అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి నుంచి ఎస్సై స్థాయి వరకు మరియు డిప్యూటేషన్ లలో పని చేస్తున్న వారి ఆయా కాల పరిమితి ని బట్టి కొత్త జిల్లాల ప్రకారం జనవరి లోగా చేపట్టాల్సిన బదిలీల ప్రక్రియ పై ఆరా తీసి కర్నూలు రేంజ్ డిఐజి చర్చించారు. కర్నూలు రేంజ్ పరిధిలో గతంలో విధులు నిర్వహించిన పోలీసు అధికారుల రికార్డులను పరిగణనలోనికి తీసుకోని నివేదికలు సిద్ధం చేసి పారదర్శకంగా బదిలీలు చేపట్టాలన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతోందని, ఎన్నికల సన్నద్ధత , శాంతిభద్రతల పరిరక్షణ పై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, ముందస్తు జాగ్రత్తల చర్యలు పాటించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి.కృష్ణకాంత్ ఐపియస్ ,నంద్యాల జిల్లా ఎస్పీ. శ్రీ కె.రఘువీర్ రెడ్డి ఐపియస్ , కడప జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ , అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ.బి.కృష్ణారావు ఐపియస్ పాల్గొన్నారు.