ఆరోగ్యశ్రీ పై అన్ని విభాగాల హెచ్ఓడీస్ తో సమీక్ష
1 min readఆసుపత్రి సూపరింటెండెంట్,డా.V.వెంకటరంగా రెడ్డి, మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి హాల్ లో వివిధ విభాగాల HODs తో ఆరోగ్యశ్రీ మరియు కేసెస్ లపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.ఆస్పత్రిలోని ప్రతి మంగళవారం నాడు ఆరోగ్యశ్రీ కేసెస్ చర్చలకు HODs తో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఆసుపత్రిలోని నర్సింగ్ సిబ్బంది యొక్క సమయపాలనతో ఉండాలని నర్సింగ్ సూపరింటెండెంట్ ని ఆదేశించారు. ఆసుపత్రిలో సిబ్బంది యొక్క వారి పనితీరు గురించి ఆయా విభాగాదిపతులు పర్యవేక్షణ చేయాలని హెచ్ఓడిసికి ఆదేశించారు.ఆసుపత్రిలోని నర్సింగ్ సిబ్బంది మరియు ఎంఎన్ఓ, ఎఫ్ఎం, లపై వస్తున్న ఫిర్యాదులపై స్పందిస్తూ ఎవరైనా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వస్తే వారికి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆస్పత్రిలో ఆయా విభాగాధిపతులు వైద్య సిబ్బందిపై పర్యవేక్షణ చేయాలని వారికి ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ CSRMO డా.హేమనలిని, హెచ్వోడీస్, డా.ఇక్బాల్ హుస్సేన్, డా.శ్రీనివాసులు డా.సీతారామయ్య, డా.మంజుల బాయ్, డా. శ్రీలక్ష్మి , RMO డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివ బాల నగాంజన్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, తెలిపారు.