పోలీస్ స్టేషన్ లలో మౌలిక ఏర్పాట్లపై సమీక్ష
1 min readపోలింగ్ స్టేషన్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను నెలాఖరులోపుగా పూర్తి చేయలి..
జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పోలీస్ స్టేషన్లో అవసరమైన మౌలిక సదుపాయాలను ఈ దళాఖరులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ సంబంధిత ఎన్నికల అధికారులతో సమావేశమై పోలీస్ స్టేషన్ లలో ఏర్పాటు చేయవలసిన మౌలిక వసతులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్ వెళ్లడానికి రావడానికి వేరు, వేరు ద్వారాలు గాని, ఒకటే పెద్ద ద్వారం ఉంటే పార్టిషన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాగే మహిళలకు, పురుషులకు వేరు వేరు టాయిలెట్స్ ఉండాలని, ఒకే టాయిలెట్ ఉంటే పురుషులకు తాత్కాలిక టాయిలెట్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. దివ్యాంగులకు వీలుగా ర్యాంపును సిద్ధం చేయాలన్నారు. లైటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, అవసరమైన చోట హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. సరిపడేంత ఫర్నిచర్ కూడా ఉండాలని తెలిపారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ స్టేషన్ల నందు వసతులు ఏర్పాటును జిల్లా విద్యాశాఖ అధికారి చూడాలని, పట్టణ ప్రాంతాల్లోనే కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడి సెంటర్లను, వ్యవసాయ, అసోసియేష హాల్స్ ను మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఇఓ ఆర్వి రమణ, సమగ్ర శిక్ష పిఓ శ్యాంసుందర్, ఈ ఈ రమా కుమారి, ఆర్ అండ్ బి ఈ ఈ లోకేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మురళీకృష్ణ , ఎలక్షన్ తాసిల్దార్ వై దుర్గా కిషోర్, తదితరులు పాల్గొన్నారు.