ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నీటి సరఫరా పై సమీక్ష
1 min read– అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు విభాగాలైన ఎం సి హెచ్, సర్జరీ, ఫిమేల్ మెడికల్ వార్డు ఇతర విభాగాలలో తనిఖీ చేసి సంబింధిత సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రిలోని కొన్ని విభాగాలలో నీటి సమస్యపై ఆరా తీశారు అనంతరం నీటి సరఫరా పై సమీక్షాసమావేశం నిర్వహించి అనంతరం పలు విభాగాల్లో నీటి సమస్యపై యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని ఏపీఎంఐడిసి ఇంజనీర్లను ఆదేశించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో నీటి సరఫరాను మెరుగు పర్చాలని సిబ్బందికి ఆదేశించారు.పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.నీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, డా.సునీల్ ప్రశాంత్, ఏపీఎంఐడిసి ఇంజనీర్లు మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి, గారు తెలిపారు.