PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘రేషన్​’ పై సమీక్ష…

1 min read

కార్డుదారులకు అందజేయాల్సిన నిత్యావసర వస్తువుల పై సమగ్ర సర్వే

  • ఇంఛార్జి జాయింట్ కలెక్టర్/డిఆర్ఓ కె.మధుసూదన్ రావు

కర్నూలు,పల్లెవెలుగు: రేషన్ కార్డుదారులకు అందజేయాల్సిన నిత్యావసర వస్తువుల పై రేషన్ డీలర్లు, ఎండియూ ఆపరేటర్స్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు, రైస్ మిల్లర్లతో సమగ్ర సర్వే కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించడం జరిగిందని ఇంఛార్జి జాయింట్ కలెక్టర్/డిఆర్ఓ కె.మధుసూదన్ రావు పేర్కొన్నారు.  శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రేషన్ కార్డుదారులకు అందజేయాల్సిన నిత్యావసర వస్తువులపై డీలర్స్, ఎండియూ ఆపరేటర్స్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు, రైస్ మిల్లర్ల నుండి జిల్లా ఇంఛార్జి జాయింట్ కలెక్టర్/డిఆర్ఓ అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంఛార్జి జాయింట్ కలెక్టర్/డిఆర్ఓ మాట్లాడుతూ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అందజేస్తున్న నిత్యావసర సరకులైన పంచదార, కందిపప్పు, బియ్యం తదితర వస్తువులను రేషన్ డీలర్లు, ఎండియూ ఆపరేటర్స్ ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఇంకా ఏవిధమైన నిత్యావసర సరుకులు ప్రజలు అడుగుతున్నారు ?  వారికి ఇంకా ఏవిధమైన నిత్యావసర సరుకులు అందజేస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుంది అనే అంశంపై జిల్లా స్థాయి, మండల స్థాయి రేషన్ డీలర్లు, ఎండియూ ఆపరేటర్స్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు, రైస్ మిల్లర్లతో సమావేశమై వారిని నుండి అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా పౌర సరఫరాల శాఖ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై వారి నుండి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. సమావేశంలో డిఎస్ఓ కెవిఎస్ఎం.ప్రసాద్, జిల్లా స్థాయి, మండల స్థాయి రేషన్ డీలర్స్, ఎండియూ ఆపరేటర్స్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author