బాలల ..న్యాయ చట్టాల అమలుపై అధికారులతో సమీక్ష
1 min read– జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి.
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బాలల న్యాయ చట్టం – 2015 ను ఉద్దేశించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డిఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ బాలల సంక్షేమ సమితి కర్నూలుకు సంబంధించి రెండు త్రైమాసిక నివేదికలను (01-04-2022 నుండి 30-06-2022) మరియు (01-07-2022 నుండి 30-09-2022) రివ్యూ చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశము నందు జాయింట్ కలెక్టర్ గారు పునరావాసం, పునరీకరణకు సంబంధించి బాలల సంక్షేమ సమితి పనితీరుపై రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్ నందు బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ శ్రీమతి జుబేద బేగం గారు ఆరు నెలలకు ముందు వివిధ రకాల బాలబాలికలకు సంబంధించి 237 కేసులు కమిటీ ముందు ఉంచడం జరిగింది, వాటిలో చాలావరకు కేసులను విచారించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. మరియు కొన్ని కేసులకు సంబంధించి బాల బాలికలను ప్రభుత్వ పాఠశాల మరియు కేజీబీవీలో చేర్పించడం జరిగిందని తెలిపారు. బాలల దత్తత విషయాలు కూడా సవరించిన చట్టం ప్రకారం కలెక్టర్ గారికి అధికారాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు జాయింట్ కలెక్టర్ గారు ప్రతి రివ్యూ నందు 18 సంవత్సరాల నుండిన బాల బాలికల పర్యవేక్షణకు మరియు మానసిక సమస్యలకు గురైన బాలబాలికలకు కూడా ఒక ఓ కమిటీ ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం వారికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపియున్నారు.ఈ సమీక్ష సమావేశంలో సిడబ్ల్యుసి సభ్యులు, కార్మిక శాఖ డిసిఎల్, దిశ పోలీసులు, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.