NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల మంజూరుకై … డిఆర్వో తహసిల్దార్లతో సమీక్ష

1 min read

జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన రావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లాలోని జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల మంజూరు  కొరకు వచ్చిన దరఖాస్తులను  త్వరితగతిన వెరిఫై చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన రావు తహశీల్దార్ల ను ఆదేశించారు.బుధవారం  కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో   జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన దరఖాస్తుల వెరిఫికేషన్ అంశంపై డిఆర్వో తహసిల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా  డిఆర్వో మాట్లాడుతూ జి.ఓ.ఎం.ఎస్ నెంబర్ 535 లో ఉన్న అన్ని నిబంధనల ప్రకారం దరఖాస్తులను వెరిఫై చేయాలన్నారు..సమాచార శాఖ నుండి   368 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తులతో పాటు అందుకు సంబంధించిన జాబితాను ఆయా మండలాలకు పంపడం జరిగిందని, ఆ మేరకు వెరిఫికేషన్ చేసి నివేదికను పంపాలని డి ఆర్ వో తహసీల్దార్లను ఆదేశించారు..సమావేశంలో ఆర్ డి ఓ హరిప్రసాద్ సమాచార శాఖ ఉపసంచాలకులు జయమ్మ, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, తహసీల్దార్లు రమేష్, విజయశ్రీ, శివ రాం, జయన్న తదితరులు పాల్గొన్నారు.

About Author