PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గైనిక్ విభాగ వైద్యులతో సమీక్ష

1 min read

– అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గైనిక్ సెమినార్ హాల్ నందు గైనిక్ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.గైనిక్ విభాగంలోని ఎఫ్ ఎన్ ఓ , వార్డ్ బాయ్స్, స్పీకర్స్, సెక్యూరిటీ సిబ్బంది, డబ్బులు వసూలు చేస్తున్నారని ముగ్గురు వ్యక్తులు మాకు కంప్లైంట్ చేసిన అనంతరం ఎంక్వైరీ కి ఆదేశాలు జారీ చేశాము.ఆస్పత్రిలోని ఎఫ్ ఎన్ ఓ -2, MNO-1 సెక్యూరిటీ_1 శానిటేషన్ సిబ్బంది-1, వేటుకి రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు అనంతరం వారిపై ఆరోపణలు నిజమైన ఎడల శాఖాహారమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈరోజు కంప్లైంట్ చేసిన వారి నుండి వివరాలు సేకరించి అనంతరం గైనిక్ సిబ్బందిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సిఎస్ఆర్ఎంఓ, మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి ఆదేశాలు జారీ చేశారు.గైనిక్ విభాగపు వైద్యులతో సమీక్ష అనంతరం పేషెంట్లకు అందుతున్న వైద్యం మరియు వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు అనంతరం పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించలని తెలిపారుచిన్న చిన్న కారణాలతో టెస్టులో బయటికి రాస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది అలాంటి వాటికి స్వస్తి పలకాలని సూచించారు.ఆస్పత్రిలోని గైనిక్ పేషెంట్లకు బయటికి పంపకుండా అక్కడే టెస్టులు మరియు స్కానింగ్ లు చేసిన అనంతరం వారికి అక్కడే ట్రీట్మెంట్ అందేటట్లు చూడాలని వైద్యులకు ఆదేశించారు.ఆస్పత్రికి గైనిక్ విభాగం నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా అడ్డుకట్ట వేయాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, ఆసుపత్రి CSRMO డా.వెంకటేశ్వరరావు, ఆసుపత్రి Dy.CSRMO, డా. హేమనలిని, గైనిక్ విభాగపతి, డా.వెంకటరమణ, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు తెలిపారు.

About Author