కరోన లో ..రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్ళను పునరుద్దరించండి..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కరోనా సందర్భంగా రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్ళు,ఎక్సప్రెస్ రైళ్లను పునరుద్దరించి ప్రధానం గా బెంగుళూరు, హుబ్లీ నుండి హాస్పట,బళ్లారి మీదుగా నిరంతరం కరువు ప్రాంత జిల్లా లు అనంతపురం, గుంతకల్లు, డోన్ మీదుగా, నంద్యాల, పూర్వ రాజధాని కర్నూలు నుండి నేటి రాజధాని విజయవాడ మీదుగా కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలకు తక్షణమే సౌకర్యం కల్గించేందుకు కృషి చేయాలని కోరుతూ మాజీ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి, డోన్ శాసన సభ్యులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ని, గుంతకల్లు రైల్వే డివిజన్ మేనేజర్ కి డోన్ రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు ద్వారా సిపిఐ ప్రతినిధి బృందం కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది.