PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైద్య విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు

1 min read

– రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.బి. అంజాద్ బాషా

పల్లవెలుగు వెబ్​ నంద్యాల: వైద్య విద్యా రంగంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి  ఖచ్చితమైన అమలుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.బి. అంజాద్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలను విజయనగరం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ ద్వారా ప్రారంభిస్తున్న కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెడికల్ కళాశాలలోని లెక్చరర్ గ్యాలరీలో వర్చువల్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి తో పాటు ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర బోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్, జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, నంద్యాల ఎంపి.పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాఖ్ బాషా, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మునిసిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, మైనారిటీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు హాబీబుల్లా, మార్క్ ఫెడ్ చైర్మన్ పి.పి. నాగిరెడ్డి, వ్యవసాయ సహాయక కార్యదర్శి గంగుల ప్రభాకర్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.బి. అంజాద్ బాషా మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికి ఆంధ్రప్రదేశ్ లో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే వుండేవని…ఈ నాలుగేళ్లలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి మరో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి… నేడు 5 కాలేజీలు ప్రారంభించడం చారిత్రాత్మక విషయమన్నారు. గతంలో ఎవరూ ఆలోచన చేయని విధంగా సి.యం ముందు ఆలోచనతో వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించి ఆరోగ్యశ్రీ తో పాటు ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులో కనివినీ ఎరుగని రీతిలో ఖాళీలన్నీ భర్తీ చేశామని మంత్రి వివరించారు. జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ నంద్యాల మెడికల్ కళాశాల నిర్మాణం కోర్టు సమస్యలు, అడ్డంకులు, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల సహకారంతో అతి తక్కువ కాలంలోనే మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో 52 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన నంద్యాల మెడికల్ కాలేజీ చారిత్రక కట్టడంగా నిలిచిపోనుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన అన్ని కాలేజీలు రెండున్నర ఏళ్ల నుండి నిర్మాణ పనులు ప్రారంభమైతే నంద్యాల మెడికల్ కాలేజీ మాత్రం శంకుస్థాపన చేసిన ఏడాది లోపే నిర్మాణం పూర్తి చేసుకుని వైద్య విద్యార్థుల అడ్మిషన్లు జరిగి క్లాసులు జరుగుతున్నాయన్నారు.స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల మెడికల్ కళాశాల ప్రారంభ నేపథ్యంలో జిల్లా ప్రజల కల నెరవేర్చారని తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కోర్టు కేసులు, ఆక్షేపణలు ఉన్నప్పటికీ తొలగించుకుని మెడికల్ కళాశాల నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యాయన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కూడా 300 పడకల నుంచి 500 పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.నంద్యాల ఎంపి.పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాఖ్ బాషా, వ్యవసాయ సహాయక కార్యదర్శి గంగుల ప్రభాకర్ రెడ్డిలు మెడికల్ కళాశాల ప్రారంభోత్సవంపై మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సునీత అమృత రాజ్, ఎపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ సరళ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author