నా హత్యకు రేవంత్ రెడ్డి కుట్ర !
1 min readపల్లెవెలుగువెబ్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అమెరికాలో ఉండి తన హత్యకు కుట్రపన్నారని ఆరోపించారు. ఆదివారం జరిగిన రెడ్ల సింహగర్జన సభలో మల్లారెడ్డి పై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘నన్ను హత్య చేసేందుకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి కుట్ర చేశారు. ప్రభుత్వం తరపున రెడ్డి గర్జన సభకు వెళ్లిన నాపై దాడి చేశారు. రేవంత్ కుట్రలు బయటకు తీసి జైలుకు పంపుతాం. రేవంత్ అసలు బాగోతం మూడో ఎపిసోడ్‌లో వివరిస్తాను. రేవంత్ వ్యవహారశైలి మా పార్టీ, ప్రభుత్వం గమనిస్తోంది. రెడ్ల ముసుగులో రేవంత్ రాజకీయ పంచాయితీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కడే రెడ్డా?.. మేము రెడ్లం కాదా?. నాకు ప్రజాధరణ వస్తుందని రేవంత్ ఓర్వలేకపోతున్నారు. రేవంత్ బ్లాక్ మెయిలింగ్ బయటపెట్టినందుకే నాపై దాడి చేశారు. నాపై దాడికి పాల్పడిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు’ అని మల్లారెడ్డి ఒకింత వార్నింగ్ ఇచ్చారు.