NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేవంత్ రెడ్డి.. టీడీపీ కోవ‌ర్టు : రోజా

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీడీపీ కోవ‌ర్టుగా ఉన్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జ‌గ‌న్ త‌న ఇంటికి ఎప్పుడూ రాలేద‌ని.. ఇక కేసీఆర్ తో ఎలా మంత‌నాలు జ‌రుపుతార‌ని ప్రశ్నించారు. 28 ర‌కాల వంట‌కాల‌తో సీఎం కేసీఆర్ కు చంద్రబాబు విందు ఏర్పాటు చేసిన సంగ‌తి రేవంత్ కు గుర్తులేదా ? అని అన్నారు. జ‌గ‌న్ త‌న ఇంటికి ఎప్పుడు వ‌చ్చాడో రేవంత్ రెడ్డి చెప్పాల‌ని అన్నారు. తెలుగు దేశం కోవ‌ర్టులా కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి వెళ్లార‌ని రోజా విమ‌ర్శించారు. రాజ‌కీయంగా ఎద‌గాలంటే పార్టీ సిద్ధాంతాల ప్రకారం వెళ్లాల‌ని సూచించారు. జ‌గ‌న్, కేసీఆర్ త‌న ఇంట్లో మంత‌నాలు జ‌రిపారని బీజేపీ నేత‌లు కూడ విమ‌ర్శిండం బాధాక‌ర‌మ‌ని ఎమ్మెల్యే రోజా అన్నారు.

About Author