రేవంత్ రెడ్డికి తప్పిన పెనుప్రమాదం !
1 min readపల్లెవెలుగువెబ్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాన్వాయికి పెనుప్రమాదం తప్పింది. తూప్రాన్ మండలం ఇమాంపూర్‌లో కాన్వాయిలోని కార్లు ఒక్కదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో రేవంత్‌రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వెళ్తుండగా ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రేవంత్ మరో వాహనంలో ఎల్లారెడ్డికి వెళ్లినట్లు తెలుస్తోంది.