వ్యక్తిత్వ వికాసంలో విద్యార్థులకు బహుమతులు
1 min read– విద్యార్థులు మానసిక సృజనాత్మక నైపుణ్యం కలిగి ఉండాలి..
– కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ రుబీనా అఫ్రిన్.
పల్లెవెలుగు వెబ్ గడివేముల: విద్యార్థులు చదువుతోపాటు సృజనాత్మక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని గడివేముల కేజీబీవీ ఎస్ఓ రుబీనా ఆఫ్రిన్ మరియు ఈ ఎం డి పి జిల్లా మేనేజర్ గోపాల్ అన్నారు. రాష్ట్రంలో ఎస్సీఈఆర్టీ మరియు సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎంటర్ ఫైన్యుల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు సమస్యపై ఎలా స్పందించాలనే అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.పాఠశాల ఫెసిలిటేటర్లైన పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణవేణి మరియు జయ లక్ష్మమ్మ లకు, విద్యార్థిని,విద్యార్థులకు వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి అంశంపై సూచనలు మరియు నిర్వహించిన వ్యక్తిత్వ వికాసంలో విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.