PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ పై ఆర్జీవీ స్పంద‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ ద‌ర్శ‌కుడు ఆర్జీవీ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పిందే నిజం అంటూ ట్వీట్ చేశారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో రాజకీయ ప్రభావం ఉందన్నారు. నాయకులు ప్రభావం చేయడంవల్లే పోలీసులు సరిగా విధులు నిర్వహించలేదని విమర్శించారు. సజ్జనార్ లాంటి సిన్సియర్ అధికారి టీఎస్ ఆర్టీసీకి పరిమితం అయ్యారని చెప్పారు. ఎంఐఎం నేతలకు టీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని ఆరోపించారు. ఒక సామాన్యుడిగా తనకు మాత్రం రఘునందన్ రావు చెప్పిందే నిజమనిపిస్తోందని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

                                  

About Author