డ్రం సీడర్ తో వరి విత్తనం వేయవచ్చు: ఏఓ
1 min readపల్లెవెలుగువెబ్, మహానంది: మహానంది మండల వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో డ్రం సీడర్ తో వరి విత్తడం ప్రారంభించారు. మండలంలోని బొల్లవరం గ్రామం లో మహానంది అనే రైతు పొలంలో డ్రం సీడర్ ద్వారా వరి విత్తనం ఎలా వేసేది రైతులకు వివరించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించడం వల్ల రైతులకు ఖర్చు తో పాటు దిగుబడి కూడా పెరుగుతుంది అన్నారు .డ్రం సీడర్ తో విత్తడం వల్ల ఎకరాకు 6000 రూపాయలు ఖర్చు ఆదా అవుతుందన్నారు .వరి విత్తనం కూడా ఎకరాకు 10 కిలోలు సరిపోతాయి అన్నారు .తెగుళ్లు చీడ పీడల నివారణఆధునిక వ్యవసాయ పద్ధతులు సాధ్యమవుతుందన్నారు రైతులు రసాయనిక క్రిమి సంహారక మందులు వాడకం తగ్గియ్యాలి అని సేంద్రియ ఎరువులు వినియోగించాలని రైతులకు సూచించారు గ్రామ వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ తో పాటు ఈ కార్యక్రమంలో రైతులు శేషయ్య, శీను ,ఖాజా హుస్సే, నాగేశ్వరరావు, పెద్దబాలన్న తదితరులు పాల్గొన్నారు.