ఘనంగా అమరజీవి జయంతి వేడుకలు
1 min read
పల్లెవెలుగువెబ్, చాగలమర్రి:చాగలమర్రి పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దారు కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్‌రెడ్డి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే స్థానిక గాంధి సెంటర్‌లో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు లక్ష్మణబాబు ఆధ్వర్యంలో అమరజీవి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం అమరజీవి చేసిన కృషిని పలువురు కొనియాడారు. కార్యక్రమం లో ఆర్‌ఐ విజయలక్ష్మి,సీనియర్ సహాయకులు శ్రీనివాసరెడ్డి,విఆర్వో హసన్,రెవెన్యూ సిబ్బంది,ఆర్య వైశ్య సంఘం నాయకులు బచ్చు సుబ్రహ్మణ్యం,వెంకటరమణ,నాగబూషణం,,నవత ప్రసాద్,తోటంశెట్టి బాబు,శ్రీనివాసులు,సత్యం,రవి తదితరులు పాల్గొన్నారు.