ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి..
1 min readకర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన యువకులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి తనను గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ ప్రజలను కోరారు. నగరంలోని 44వ వార్డు సీతారాం నగర్లో ఏర్పాటుచేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో వైసీపీకి చెందిన యువకులు సుబ్బు, షణ్ముక్, సాయి, నవీన్, ప్రదీప్ లు.. టిడిపి నాయకులు దేవా, మనోజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి తర్వాత సమస్యల పట్ల నాయకులను నిలదీయాలన్నారు. రానున్న ఎన్నికల్లో తప్పకుండా పూర్తి స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. పార్టీ క్యాడర్ మొత్తం ప్రజలతో మాట్లాడి చైతన్యం తీసుకురావాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఉంటాయన్నారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడన్నారు. ఇక కర్నూల్లో గత పదేళ్లుగా తమ కుటుంబం అధికారంలో లేకపోయినా ప్రజాసేవలో మాత్రం ఉందన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు. తాను గెలిస్తే ఏం చేస్తానో చెబుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నానన్నారు. వైసీపీ నేతలు మాత్రం కులం పేరు చెప్పుకొని ఓట్లు వేయాలని కోరుతారన్నారు. ఒక్క కియా పరిశ్రమ అనంతపురం రూపురేఖలు మార్చేసిందన్నారు. అలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు కర్నూలుకు తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని యువతకు ఆయన హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్తగా తనకున్న అనుభవంతో కంపెనీలు తెస్తానని చెప్పారు. తాను రూపొందించిన 6 గ్యారెంటీలు ఐదేళ్లలో పూర్తి చేసి కర్నూలును అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానన్నారు. ప్రజలందరి ఆశీర్వాదం తెలుగుదేశం పార్టీపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు హరిబాబు, రమేష్, శ్రీధర్, ప్రభాకర్, క్రిష్ణవేణి, జ్యోతి, సుబ్రహ్మణ్యం, సురేంద్ర రెడ్డి, లోకేష్, తదితర నాయకులు, బూత్ ఇంచార్జీలు, పాల్గొన్నారు. టి.జి భరత్ సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శం.. పార్టీలో చేరిన యువకుడు సుబ్బు టి.జి భరత్ చేసే సేవా కార్యక్రమాలు తమకు ఆదర్శమని పార్టీలో చేరిన యువకుడు సుబ్బు చెప్పారు. రాజకీయంగా ఎలాంటి అధికారిక పదవి లేకపోయినా ప్రజలకు ఏదోవిధంగా సేవ చేస్తున్నారన్నారు. పదవిలో ఉంటే కర్నూలును ఎంతో అభివృద్ధి చేస్తారన్న నమ్మకం తమ యువతకు ఉందని తెలిపారు. తాము ఓట్లేయడమే కాకుండా ప్రతి ఒక్కరితో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయించేందుకు కష్టపడతామని టి.జి భరత్‌కు హామీ ఇచ్చారు. కర్నూలు అభివృద్ధిలో తాము కూడా భాగం అవుతామన్నారు.