ఓటు హక్కు మన జన్మ హక్కు
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ఓటు హక్కు మన జన్మ హక్కు అని డిప్యూటీ కలెక్టర్ రమా అన్నారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులతో తహసీల్దార్ కార్యాలయం నుండి రాఘవేంద్ర సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఓటు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో కొత్తగా వచ్చిన ఓటర్ల కు అవగాహన కల్పించారు. సీనియర్ సిటిజన్స్ రామస్వామి కి, ట్రాన్స్ జెండర్ మౌనిక కు శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరు మంచి నాయకుడిని ఎన్నుకుని ఓటు వేయాలని కోరారు. ఓటును నోటు తో కొనేందుకు నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చంద్రశేఖర్, ఎన్నికల డిటి శశి శేఖర్, వీఆర్వో భీమన్న గౌడ్, సిపిఎం నాయకులు భాస్కర్ యాదవ్, జయరాజు, బిజెపి నాయకులు మాధవరం విష్ణువర్ధన్ రెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.