ధరల పెరుగుదల.. 12 ఏళ్ల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
1 min readపల్లెవెలుగు వెబ్: నవంబర్ నెలలో టోకు ద్రవ్యోల్బణం 12 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. అక్టోబర్ లో 12.54 శాతం ఉండగా.. నవంబర్ లో 14.23 శాతానికి చేరింది. వరుసగా రెండో నెల టోకు ద్రవ్యోల్బణం రెండంకెల్లో నమోదైంది. ఇంధన, మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, సహజవాయివు, రసాయనాలు, రసాయన ఉత్పత్తుల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం రెండంకెల్లో నమోదైంది. ఇంధన, విద్యుత్ విభాగాల్లో 39.81 శాతంగా నమోదు కాగా.. ఆహార పదార్థాల ధరలు రెండింతలు అయ్యాయి. దీంతో అక్టోబర్ లో 3.06 శాతంగా ఉన్న ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 6.70 శాతానికి చేరింది.