NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పుంజుకుంటున్న బంగారం !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : బంగారం ధ‌ర రోజురోజుకూ పెరుగుతోంది. ఢిల్లీలో స్వచ్చమైన బంగారం ధ‌ర సోమ‌వారం 69 రూపాయ‌లు పెర‌గ‌గా.. మంగ‌ళ‌వారం 389 రూపాయ‌లు పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధ‌ర 46,762కి చేరింది. గ‌త ట్రేడింగ్ లో 46,373 గా ఉంది. వెండి కూడ బంగారం బాట‌లోనే ప‌య‌నిస్తోంది. కిలో వెండి 397 పెర‌గ‌డంతో .. వెండి ధ‌ర 69,105కి చేరింది. అంత‌ర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధ‌ర 1806 డాల‌ర్లుగా ట్రేడ్ అవుతోంది. ఔన్సు వెండి ధ‌ర 26.63 డాల‌ర్లు ట్రేడ్ అవుతోంది. డాల‌ర్ బ‌ల‌హీన‌ప‌డ‌టంతో బంగారం ధ‌ర‌లు పెర‌గ‌డానికి కార‌ణ‌మయ్యాయ‌ని హెచ్డీఎఫ్సి సెక్యురిటీస్ సీనియ‌ర్ క‌మోడిటి విశ్లేష‌కుడు త‌ప‌న్ ప‌టేల్ పేర్కొన్నారు.

About Author