NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్కే జీవిత‌చ‌రిత్ర ప్రచురించ‌డానికి అనుమ‌తివ్వాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ : మావోయిస్టు పార్టీ కీల‌క నేత ఆర్కే అలియాస్ అక్కిరాజు హ‌ర‌గోపాల్ జీవిత‌చరిత్ర ప్రచురించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఆయ‌న భార్య శిరీష డిమాండ్ చేశారు. చ‌నిపోయిన తర్వాత ఎవ‌రైనా సంస్మర‌ణ స‌భ జ‌రుపుకుంటార‌ని, తాను అదే విధంగా సంస్మర‌ణ స‌భ చేయాల‌ని చూస్తే అడ్డుకున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. 2004లో ప్రభుత్వంతో ఆర్కే చ‌ర్చల‌కు వ‌చ్చిన‌ప్పుడు ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాలు, ఫోటోలు దాచుకున్నాన‌ని, 2010లో అరెస్టయిన‌ప్పుడు వ‌చ్చిన ఫోటోలు, క‌థ‌నాలు కూడ దాచుకున్నాన‌ని తెలిపారు. ఇవ‌న్నీ క‌లిపి తాను పుస్తకంగా రాయాల‌ని భావించాన‌ని ఆమె తెలిపారు. రెండురోజుల క్రితం ప్రిటింగ్ ప్రెస్ పై దాడిచేసి పోలీసులు ఎత్తుకెళ్లార‌ని ఆమె ఆరోపించారు. ఆ పుస్తకాలు ఇవ్వాల‌ని, ఆవిష్కర‌ణ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని ఆమె కోరారు.

About Author