ఆర్ ఎన్ ఐ ప్రతి పత్రికకు ఆక్రిడి టేషన్లు ఇవ్వండి
1 min read– జర్నలిస్ట్ ల ఐక్య కార్యచరణ కమిటీ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఆర్ ఎన్ ఐ ప్రతి పత్రికకు ఆక్రిడి టేషన్లు ఇవ్వండి అని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.సృజన ను జర్నలిస్ట్ ల ఐక్య కార్యచరణ కమిటీ కోరారు. మంగళవారంజర్నలిస్ట్ ల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.సమాచార శాఖ అధికారులు 80 శాతం హజర్ అన్న పత్రికలను మాత్రమే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా పేరులు నమోదు చేశారని అది తొలగించాలని,ఆర్ ఎన్ ఐ కలిగిన ప్రతి పత్రికని ఆన్ లైన్ లో పొందు పరచాలని కోరారు. పాత నిబంధన ప్రకారం రెగ్యులేటరీ తో సంబంధం లేకుండా ఆర్ ఎన్ ఐ ప్రతి పత్రికకు ఆక్రిడి టేషన్లు ఇవ్వాలనీ కోరారు.స్థానిక పత్రికలకు ప్రభుత్వం నుండి ఎలాంటి యాడ్ సపోర్ట్ లేదనీ ,80 శాతం రెగ్యులర్ గా తీయాలంటే కష్టం అవుతుందని తెలిపారు.అలాగే జిల్లాల విభజనతో నంద్యాల,జిల్లాలో స్థానిక పత్రికలకు ఆక్రిడి టేషన్ దాఖాస్తు చేసుకోవడానికి కాలం చూపడం లేదని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు…జిల్లాలో దాదాపు 15 సంవత్సరాల నుండి జర్నలిస్ట్ లకు ప్రభుత్వ నుండి ఎలాంటి ఇంటి స్తాలలు లేవు అని ప్రతి మండలంలో ఉన్న జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలనీ కోరారు..జిల్లా కలెక్టర్ అక్రిడిటేషన్స్ సమస్యను సమాచార అధికారులతో మాట్లాడుతాను అని తమ పరిధిలో ఉంటే కచ్చితంగా న్యాయం చేస్తాం అని,అలాగే జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు ఇచ్చే విధంగా చూస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ లు బాబు రావు,సత్యన్నరాయలసీమ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు బత్తిన నవీన్,చంద్ర శేఖర్ రెడ్డి, డి.షరీఫ్,రేపల్లె రాజు, ఏ పి జే ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జాప్ జిల్లా గౌరవ అధ్యక్షులు జి.సత్తార్,విజయ్, వినాయక్,నజీర్, తదితరులు పాల్గొన్నారు.